జయలలిత చికిత్సపై ఆసుపత్రిలో నాకు అందిన సమాచారం సెకండ్ హ్యాండే: పన్నీర్ సెల్వం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెన్నయ్‌లో చికిత్స అందిస్తోన్న నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై
ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరిన్ని విషయాలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... జయలలిత చికిత్స తీసుకుంటున్న సమయంలో తాను ఒక్కసారి కూడా ఆమెను చూడలేదని, ఆమె ఆరోగ్యం గురించి వైద్యులు తనకు తెలిపిన విషయాలనే తాను మీడియాకు చెప్పానని అన్నారు. ఆమె చికిత్సపై తనకు అందిన సమాచారం సెకండ్ హ్యాండేనని వ్యాఖ్యానించారు.
ఆసుపత్రిలో జయలలిత 75 రోజులపాటు చికిత్స పొందిన సమయంలో ప్రతిరోజు తాను అక్కడే ఉన్నానని పన్నీర్ సెల్వం చెప్పారు. జయలలితకు అందించిన చికిత్సపై, మరణంపై వైద్యులు ఇచ్చిన వివరణలతో ప్రజల అనుమానాలు తీరలేదని అన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అప్పుడే ప్రజలకు స్పష్టత వస్తుందని చెప్పారు.